ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం, పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ విచారణ చేట్టింది. జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం.. పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టినవారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల్ని నిలదీసింది.
NGT Fire on AP Govt: ఏపీ సర్కారుపై ఎన్జీటీ ఫైర్... ప్రాజెక్టుల నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు - తెలంగాణ వార్తలు
పర్యావరణ చట్టాన్ని ఏపీలో తీవ్రంగా ఉల్లంఘించడం సిగ్గుచేటని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్ ఆదర్శకుమార్ నేతృత్వంలోని ఎన్జీటీ ప్రధాన ధర్మాసనం.. పర్యావరణ అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలవరం కాఫర్ డ్యాం వల్ల ముంపు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని అధికారుల్ని నిలదీసింది.
కేంద్ర పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి కూడా చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఎన్జీటి.. కేసు ముగించాలన్న ఆతృత మాత్రమే సీపీసీబీ(CPCB) నివేదికలో కనిపించిందని తప్పుబట్టింది. చట్టబద్దంగా నివేదిక ఇవ్వాలన్న చిత్తశుద్ది లోపించిందన్న ఎన్జీటి.. మరోవైపు ఏపీ ప్రభుత్వమే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపడితే ఎలా అని ఘాటుగా స్పందించింది. సాయంత్రం పూర్తి తీర్పును ఇవ్వనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.
ఇదీ చదవండి:KRMB, GRMB Meeting: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ... తెలంగాణ గైర్హాజరు