విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్ లీకేజీ ప్రమాదంపై విచారణ జరిపిన జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) కమిటీ ఆదివారం మధ్యంతర నివేదికను ఆన్‌లైన్‌లో సమర్పించింది. ఈనెల 11వ తేదీ నుంచి ఎన్‌జీటీ కమిటీ సభ్యులు ఆచార్య సి.హెచ్.వి.రామచంద్రమూర్తి, ఆచార్య పి.జె.రావు, డాక్టర్ బాషా విచారణ నిర్వహించారు.
విశాఖ ఘటన: ఎన్‌జీటీ కమిటీ మధ్యంతర నివేదిక - జస్టిస్ శేషశయనారెడ్డి కమిటీ వార్తలు
విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్ లీకేజీ ప్రమాదంపై విచారణ జరిపిన ఎన్‌జీటీ కమిటీ ఆదివారం మధ్యంతర నివేదికను ఆన్‌లైన్‌లో సమర్పించింది. ఎన్‌జీటీ నుంచి వచ్చే తదుపరి ఆదేశాల ప్రకారం మిగిలిన విచారణను పూర్తిచేస్తారు.
విశాఖ ఘటన: ఎన్‌జీటీ కమిటీ మధ్యంతర నివేదిక
కమిటీకి ఛైర్మన్‌గా నియమితులైన జస్టిస్ శేషశయనారెడ్డి విశాఖ వచ్చి క్షేత్రస్థాయిలో విచారించి పలు వివరాలు రాబట్టారు. వాటి ఆధారంగా మధ్యంతర నివేదికను రూపొందించారు. నివేదిక ప్రతిని ఎల్‌జీ పాలిమర్స్ ప్రతినిధులకూ ఇచ్చారు. ఎన్‌జీటీ నుంచి వచ్చే తదుపరి ఆదేశాల ప్రకారం మిగిలిన విచారణను పూర్తిచేస్తారు.
ఇదీ చదవండి:విశాఖ ఘటన: బయటికొచ్చిన సీసీ పుటేజీ దృశ్యాలు