NGT on RLIS: 'ఏపీ సీఎస్ తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్లు వేశారు..' - ఎన్జీటీ విచారణ
15:28 September 21
NGT: రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో వాదనలు
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్‌జీటీ చెన్నై బెంచ్‌లో వాదనలు(NGT Chennai Bench Hearing On Rayalasima lift irrigation scheme) జరిగాయి. కోర్టు ధిక్కరణపై చర్యలు తీసుకునే అధికారం ఎన్‌జీటీకి ఉందని పిటిషనర్ వాదించారు. ఎన్‌జీటీ చట్టం సెక్షన్ 26, 28 కింద చర్యలు తీసుకోవచ్చని వాదించారు. ఈనెల 30న ఏపీ సీఎస్ రిటైర్ అవుతున్నారని ఎన్‌జీటీకి తెలిపారు.
కేసు తప్పుదోవ పట్టించేలా ఏపీ సీఎస్ అఫిడవిట్లు వేశారని పిటిషనర్ తెలిపారు. ఎన్‌జీటీ అధికారాలపై సుప్రీం తీర్పులు ప్రస్తావించారు. తీర్పు ఉల్లంఘన జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 27న తెలంగాణ వాదనలు వినిపించనుంది. వాదనల అనంతరం కోర్టు ధిక్కరణ కేసులో ఎన్‌జీటీ తీర్పు ఇవ్వనుంది.
ఇదీ చదవండి:CM KCR Review On RTC: ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష