హైదరాబాద్లోని బోరబండ, నాట్కో స్కూల్, సాయిబాబా నగర్, ఎన్ఆర్ఆర్ పురం తదితర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి వచ్చింది భూకంపం కాదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతో కలిసి.. ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.
శబ్దాలు మాత్రమే.. భూకంపం కాదు : ఎన్జీఆర్ఐ - జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్
హైదరాబాద్ బోరబండ ప్రాంతాన్ని ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్లు పర్యటించారు. శుక్రవారం రాత్రి బోరబండ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సాంకేతిక పరికరాల ద్వారా పరీక్షించి భయపడాల్సిన అవసరం లేదని.. అది భూకంపం కాదని.. భూమి నుంచి వచ్చిన శబ్దాలు మాత్రమే అని స్పష్టం చేశారు.
![శబ్దాలు మాత్రమే.. భూకంపం కాదు : ఎన్జీఆర్ఐ NGRI Scientist Visits Borabanda](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9039397-929-9039397-1601737068027.jpg)
శబ్దాలు మాత్రమే.. భూకంపం కాదు : ఎన్జీఆర్ఐ
సీనియర్ శాస్త్రవేత్త శేఖర్ శబ్దాలు వచ్చిన ప్రాంతాల్లో పర్యటించి మైక్రో డైమర్ హ్యాపింగ్, అబ్జర్వ్ ఇన్సాల్టింగ్ తదితర పరికరాలు అమర్చారు. రాత్రి సమయంలో భూమి నుంచి శబ్దాలు మాత్రమే అని.. భూకంపం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని డిప్యూటి మేయర్ బాబా ఫసీయుద్దీన్ ధైర్యం చెప్పారు.