హైదరాబాద్ హబ్సిగూడలోని సీఎస్ఐఆర్-ఎన్జీఆర్ఐ డైమండ్ జూబ్లీ వేడుకలను ఆదివారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్, ఇండస్ట్రియల్ రీసెర్చి కార్యదర్శి ప్రొఫెసర్ శేఖర్, సి. పాండేలు దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. దేశ భవిష్యత్తు జియో సైన్సెస్ పరిశోధనల పైనే ఆధారపడి ఉందని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో జియో సైన్సెస్ పరిశోధనలు కీలకం : ప్రొ.విజయ రాఘవన్ - ప్రొఫెసర్ విజయ రాఘవన్
రానున్న రోజుల్లో దేశ భవిష్యత్తు జియో సైన్సెస్ పరిశోధనలపైనే ఆధారపపడనుందని కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ రాఘవన్ తెలిపారు. హబ్సిగూడలోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైమండ్ జూబ్లీ వేడుకల్లో ఆయన ముఖఅయ అతిథిగా పాల్గొన్నారు.

భవిష్యత్తులో జియో సైన్సెస్ పరిశోధనలు కీలకం : ప్రొ.విజయ రాఘవన్
పరిశోధన సంస్థలు, పరిశ్రమల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల వివరాలను సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నాగేశ్, ఎన్జీఆర్ఐ సాధించిన వివరాలను సంస్థ డైరెక్టర్ తివారి వివరించారు. వేడుకల లోగోను ఆవిష్కరించి.. ఉద్యోగులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ పూర్ణచందర్ రావు, డాక్టర్ కీర్తి శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ...కొత్త వ్యవసాయ చట్టాల పిటిషన్లపై సుప్రీంలో నేడు విచారణ