రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతవరణ శాఖ తెలిపింది. ఎత్తుకు వెళ్లేకొద్ది ఉపరితల ఆవర్తనం దక్షిణ దిశ వైపు వంపు తిరుగుతున్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
ఏపీ తీరానికి దగ్గర్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కి.మీ. ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ శాఖ తెలిపింది. ఇవాళ రాష్ట్రంలోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించింది.
దీని ప్రభావంతో శుక్రవారం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, జనగామ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్ జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. శనివారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇవీ చూడండి:విద్యుత్ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: జగదీశ్‌రెడ్డి