రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్ పట్టణ, వరంగల్ గ్రామీణ, జనగామ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట జిల్లాల్లో... ఈ రోజు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో 7.6 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉపరితల ఆవర్తనంతో రాగల మూడు రోజులు వర్షాలు! - వర్షం వార్తలు
ఉత్తర ఇంటీరియర్ ఒడిశా, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

ఉపరితల ఆవర్తనం తో రాగల మూడు రోజులు వర్షాలు!