రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు నాగరత్న వెల్లడించారు. ఈ సమయంలో గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ముఖ్యంగా ఇవాళ, రేపు ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో... ఒకటి రెండు ప్రదేశాల్లో ఈ పరిస్థితి ఉంటుందని నాగరత్న తెలిపారు.
రాష్ట్రంలో రాగల మూడు రోజులు వడగండ్ల వర్షాలు..! - imd director on weather report
రాగల మూడు రోజులు రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ, రేపు ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో... ఒకటి రెండు ప్రదేశాల్లో ఈదురుగాలులు వీస్తాయని సంచాలకులు తెలిపారు.
next three days heavy rains in telangana
ఈ రోజు పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కేరళ వరకు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాప్తించి ఉందని ఐఎండీ సంచాలకులు వివరించారు.