తెలంగాణ

telangana

By

Published : Nov 6, 2020, 12:12 PM IST

ETV Bharat / city

వాడపల్లి జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా.. బడి ఖాళీ...

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. నవంబర్ 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభంకావటం వల్ల వైరస్ వ్యాప్తి విజృంభిస్తోంది. ఆత్రేయపురం మండలం వాడపల్లి జడ్పీ పాఠశాలలోని ఓ ఉపాధ్యాయురాలికి కరోనా సోకటం వల్ల విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

corona-cases-in-vadapalli-school-in-east-godavari-district
వాడపల్లి జడ్పీ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఓ ఉపాధ్యాయురాలికి కరోనా సోకడం వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయురాలుకు కరోనా లక్షణాలు ఉండడం వల్ల నవంబర్ 1వ తేదీన కరోనా పరీక్ష చేయించుకున్నారు. రెండో తేదీన ఆమె పాఠశాలకు వచ్చి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అదే రోజు మధ్యాహ్నం ఆమెకు కరోనా సోకినట్లు తెలియడం వల్ల ఉపాధ్యాయురాలిని ఇంటికి పంపించేశారు.

ఆ పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తుండగా తొలిరోజు 25 మంది మాత్రమే హాజరయ్యారు. విషయం బయటకు తెలిశాక విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ఒక్కరూ పాఠశాలకు రాలేదు. 13 మంది ఉపాధ్యాయులకు కేవలం ఆరుగురు ఉపాధ్యాయులే హాజరయ్యారు. విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో వారు కూడా ఇంటికి వెళ్ళిపోయారు. విద్యార్థులందరికీ కరోనా పరీక్షలు చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చదవండి అక్రమంగా రేషన్‌ బియ్యం తరలింపు... ఎనిమిది మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details