New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఒకటీ రెండు రోజుల్లోనే నోటిఫికేషన్ జారీకి కార్యాచరణ మొదలు పెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ఈ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను త్వరలోనే ఆరంభించనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 25 లోక్‌సభ నియోజకవర్గాలను జిల్లాలుగా మార్చాలని నిర్ణయించారు. అతిపెద్దదిగా ఉన్న గిరిజన లోక్‌సభ నియోజకవర్గం అరకును.. రెండు జిల్లాలుగా చేయాలని ప్రతిపాదించారు. జిల్లాల ఏర్పాటుపై ఇప్పటికే సంప్రదింపులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్ర, జిల్లాస్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం వారి నుంచి క్షేత్రస్థాయిలోని అభ్యంతరాలు, వివాదాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగం నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చాలని ప్రతిపాదించారు. అయితే.. క్షేత్రస్థాయిలో వ్యక్తమైన అభ్యంతరాలు, ఆర్ధిక పరిస్థితులు, మానవ వనరుల విభజన తదితర అంశాలపై ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈలోగా నోటిఫికేషన్ జారీకి.. ప్రభుత్వం సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది.
New Districts in AP: ఏపీలో మరోసారి తెరపైకి కొత్త జిల్లాలు! - new districts in andhrapradesh
New Districts in AP: ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ కదలిక వస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను.. 26 జిల్లాలుగా మార్పు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

New Districts in AP: ఏపీలో మరోసారి తెరపైకి కొత్త జిల్లాలు!
మరోవైపు జనగణన ప్రక్రియ పూర్తికాకుండా ప్రాంతాల భౌగోళిక స్వరూపం మార్చవద్దంటూ కేంద్ర ప్రభుత్వం 2020లో రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే.. వివిధ రాష్ట్రాల నుంచి అభ్యర్థనల దృష్ట్యా ప్రాంతాల పునర్విభజనకు 2022 జూన్ వరకూ కేంద్రం అనుమతి ఇచ్చింది. కొవిడ్ తీవ్రత దృష్ట్యా జనగణన ఆలస్యం కావటంతో..ఈ ప్రక్రియను కొనసాగించుకునేందుకు కేంద్రం అవకాశం కల్పించింది. ఫలితంగా.. జిల్లాల పునర్విభజన ప్రక్రియపై నోటిఫికేషన్ జారీ చేయాలని...ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి: