రాష్ట్రంలో కొత్తగా 2,426 కరోనా కేసులు, 13 మరణాలు
08:35 September 11
రాష్ట్రంలో కొత్తగా 2,426 కరోనా కేసులు, 13 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,426 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 338 కరోనా బారిన పడ్డారు. వీటితో కొవిడ్ బాధితుల సంఖ్య 1,52,602కి చేరింది. మహమ్మారి బారిన పడి 13 మంది మరణించగా... ఇప్పటివరకు మొత్తం 940 మంది మృత్యువాతపడ్డారు.
కరోనా నుంచి మరో 2,324 మంది బాధితులు కోలుకోగా... ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,19,467కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 32,195 యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో 25,240 మంది కరోనా బాధితులున్నట్లు వెల్లడించారు.