ఏపీలో 24 గంటల వ్యవధిలో 87,756 మందికి పరీక్షలు చేయగా.. 4,549 మందికి పాజిటివ్‌గా తేలింది. మహమ్మారి సోకి మరో 59 మంది మృతిచెందారు. మరో 10,114 మంది బాధితులు కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
AP Corona cases: కొత్తగా 4,549 కరోనా కేసులు.. 59 మరణాలు
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,756 నమూనాలను పరీక్షించగా.. 4,549 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 18,14,393 మంది వైరస్ బారినపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 4,549 కరోనా కేసులు.. 59 మరణాలు
వైరస్ బారినపడి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 12 మంది మరణించగా.. ప్రకాశం జిల్లాలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో 6, కృష్ణా జిల్లాలో ఐదుగురు మృతిచెందినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొంది. చిత్తూరు జిల్లాలో 860, తూర్పుగోదావరి జిల్లాలో 619, పశ్చిమగోదావరి జిల్లాలో 529, కడప జిల్లాలో 412 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి:Cases: రాష్ట్రంలో కొత్తగా 1,511 కరోనా కేసులు, 12 మరణాలు