ఏపీలో కొత్తగా 4,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదు - ap corona latest news
18:32 July 20
ఏపీలో కొత్తగా 4,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
ఏపీలో కరోనా ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 4,074 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెుత్తం బాధితుల సంఖ్య 53,724కు చేరింది. వైరస్‌తో మరో 54 మంది మృతి చెందగా.. మెుత్తం మృతుల సంఖ్య 696కు చేరింది. 24 గంటల వ్యవధిలో 33,580 కొవిడ్ నమూనాలు పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 లక్షల 49 వేల 112 మందికి కరోనా పరీక్షలు చేశారు.
జిల్లా నమోదైన కేసులు తూర్పు గోదావరి 1,086 కర్నూలు 559 గుంటూరు 596 పశ్చిమ గోదావరి 354 అనంతపురం 342 శ్రీకాకుళం 261 ప్రకాశం 221 కడప 152 కృష్ణా 129 చిత్తూరు 116 విశాఖ 102 నెల్లూరు 100 విజయనగరం 56
వైరస్ కారణంగా తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున మృతి చెందగా..కృష్ణాలో ఏడుగురు, అనంతపురం జిల్లాలో ఆరుగురు మృతి బలయ్యారు. చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున.. కడప, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.
ఇదీ చూడండి :అమానవీయం: కరోనా భయంతో వర్షంలోనే మృతదేహం