మంత్రి కేటీఆర్‌ను న్యూజిలాండ్ ఎత్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ కలిశారు. అగ్రిటెక్, ఇన్నొవేషన్, స్టార్టప్ రంగాల్లో కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. న్యూజిలాండ్‌లో పర్యటించాలని మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు.
న్యూజిలాండ్ ప్రభుత్వ, పారిశ్రామిక వర్గాలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్‌ను న్యూజిలాండ్ ఎత్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధక్రిష్టన్ కలిశారు. తెలంగాణలో ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యారంగాల్లో కలిసి పని చేసేందుకు న్యూజిలాండ్‌కు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరించారు.