KADIYAM NURSERIES AP: నూతన సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం - తెలంగాణ వార్తలు
KADIYAM NURSERIES AP: నూతన సంవత్సరానికి తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలు ఘన స్వాగతం పలికాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా పల్ల వెంకన్న, సత్యదేవా నర్సరీలు మొక్కల కూర్పుతో 2022కు స్వాగతం పలికారు. పల్ల వెంకన్న నర్సరీలో లక్షకుపైగా మొక్కలతో 2022ను ఏర్పాటు చేశారు. జై జవాన్ జైకిసాన్ నినాదంతో మొక్కలతో రూపొందించారు. 25 మంది కూలీలు 4 రోజుల పాటు కష్టపడి మొక్కలతో నూతన సంవత్సరం 2022 ను రూపొందించారు. సత్యదేవా నర్సరీలోనూ మొక్కలతో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. మొక్కలతో దేశానికి రైతే రాజు, వృక్షాల్ని కాపాడదాం, భూమిని రక్షిద్దాం సందేశాలు రూపొందించారు..ఇవి చూపరుల్ని విశేషంగా ఆకర్షిస్తున్నాయి.
నూతన సంవత్సరానికి సరికొత్తగా స్వాగతం