2021 వచ్చేసింది... కోటి ఆశలతో స్వాగతం - telangana news
కొత్త సంవత్సరానికి తెలుగు ప్రజలు స్వాగతం పలికారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలు నిరాడంబరంగా జరిగాయి.
2021 సంవత్సరం వచ్చేసింది. కొత్త సంవత్సరానికి తెలుగు ప్రజలు ఎంతో ఉత్సాహంతో స్వాగతం పలికారు. నూతన ఉత్సాహంతో ముందుకు సాగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. 2020 కాల గర్భంలో కలిసిపోయింది. ఓ ఏడాదే కాదు, ఓ దశాబ్దం ముగిసిపోయింది. కోటి ఆశలతో నూతన సంవత్సరంలో, కొత్త దశాబ్దంలో అడుగు పెడుతున్నాం. 2020 సంవత్సరం మిగిల్చిన విషాద అనుభవాలతో చాలా మంది నూతన సంవత్సర వేడుకలను నిరాడంబరంగా జరుపుకున్నారు. కరోనా వైరస్ కారణంగా, మరీ ముఖ్యంగా కొత్త వైరస్ కలకలం నేపథ్యంలో ఈసారి వేడుకల్లో సందడి కనిపించడం లేదు.