అమరావతి రైతుల ఆవేదనపై పాట - ap capital city
రాజధానిగా అమరావతే కావాలంటూ రైతులు చేస్తోన్న పోరాటంపై 'రాజధాని మార్పు పేర... మా బతుకులు బుగ్గి చేస్తే...' అంటూ విడుదలైన ప్రత్యేక గీతం ఎంతో ఆదరణ పొందుతోంది. అమరావతిలోని ప్రతి గ్రామంలోనూ ఇదే పాట ప్రతిధ్వనిస్తోంది. నాడు భూములు ఇవ్వాల్సిన పరిస్థితులు... నేడు వాటి పరిణామాలను వివరిస్తూ ఆ ప్రాంత ప్రజలే ఈ పాటను రూపొందించుకున్నారు. ఆందోళనలు నిర్వహించే ముఖ్యకేంద్రాలతో పాటు ప్రతి గ్రామంలోనూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ రైతులు ఈ పాటనే మైక్ల్లో వినిపిస్తున్నారు. రైతుల పోరాటానికి మద్దతుగా పలు స్వచ్ఛంద సంస్థలు ఆ పాటకు వీడియోలు జోడించి అన్నదాతలకు అంకితమిచ్చాయి.
amaravathi