vijayasai reddy: విజయసాయిరెడ్డికి కొత్త బాధ్యతలు - vijayasai reddy latest news
12:13 March 01
vijayasai reddy: విజయసాయిరెడ్డికి కొత్త బాధ్యతలు
వైకాపా అనుబంధ విభాగాల బాధ్యతలను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డికి అప్పగించారు. వైకాపా అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ సోమవారం ప్రకటించింది. ఈ విభాగాల బాధ్యుడిగా మొదటి నుంచి విజయసాయిరెడ్డే వ్యవహరిస్తున్నారు. వచ్చే జులైలో పార్టీ ప్లీనరీ సందర్భంగా రాష్ట్ర స్థాయి కమిటీలను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆయా విభాగాల నియామకాల వ్యవహారాలను చూసేందుకు విజయసాయిరెడ్డికి మరోసారి బాధ్యతలు అప్పగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
‘వైకాపా అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జిగా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు. నాపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించి.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను’ అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి: Gun firing on Realtors : రియల్టర్లపై కాల్పులు.. పోలీసుల అదుపులో అనుమానితుడు