AP Drainage Board : నిధుల లభ్యతకు మించి పనుల మంజూరు.. సొమ్ము వసూలయ్యాకే బిల్లులిస్తామని షరతు.. ఈలోగా కోర్టుకు వెళ్లడానికి వీల్లేదని నిబంధన.. వీటన్నింటికీ మించి కాలువల్లో నీటి విడుదలకు 4 రోజుల ముందు టెండర్లు కోరడం.. ఇదీ ఏపీ డ్రైనేజీ బోర్డు తీరు! ఏటా కాలువలకు నీటి విడుదలకు ముందు డ్రెయిన్ల మరమ్మతు, తూటుకాడ తొలగింపు వంటివి చేపడతారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఈ పనులకు చీరాల మురుగునీటి పారుదలశాఖ గుత్తేదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 28 పనులకు సుమారు రూ. 2.83 కోట్లతో టెండర్లు పిలిచింది.
'బిల్లులొచ్చినప్పుడే చెల్లింపులు.. ఆలస్యమైతే కోర్టుకెళ్లొద్దు' - AP Drainage Board
AP Drainage Board : ఏపీలో ఏటా కాలువలకు నీటి విడుదలకు ముందు డ్రెయిన్ల మరమ్మతు, తూటుకాడ తొలగింపు వంటివి చేపడతారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఈ పనులకు చీరాల మురుగునీటి పారుదలశాఖ గుత్తేదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 28 పనులకు సుమారు రూ. 2.83 కోట్లతో టెండర్లు పిలిచింది. అయితే డబ్బులు వసూలైనప్పుడే గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తామని.. అంతవరకు కోర్టులకు వెళ్లకూడదని షరతు విధించడం చర్చనీయాంశమైంది.
!['బిల్లులొచ్చినప్పుడే చెల్లింపులు.. ఆలస్యమైతే కోర్టుకెళ్లొద్దు' AP Drainage Board](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-15440416-315-15440416-1654044918279.jpg)
అయితే డబ్బులు వసూలైనప్పుడే గుత్తేదారులకు బిల్లులు చెల్లిస్తామని.. అంతవరకు కోర్టులకు వెళ్లకూడదని షరతు విధించడం చర్చనీయాంశమైంది. పశ్చిమ డెల్టాలో నీటితీరువా నిధులు రూ.6 కోట్లు అందుబాటులో ఉండగా, రూ. 13 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చారు. పైగా చేసిన పనులకు ఎప్పుడు డబ్బులు ఇస్తామో తెలియదంటూ టెండరు ప్రకటనలోనే పేర్కొనడంతో గుత్తేదారులు మీమాంసలో పడ్డారు. వివిధ రకాల పనులు పూర్తి చేసిన పలువురు గుత్తేదారులకు బిల్లులు సకాలంలో రాకపోవడంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. అందుకే కోర్టులకు వెళ్లకూడదనే నిబంధన కొత్తగా పెట్టారు.