New power charges in telangana: డిస్కంలు వీలైనంత త్వరగా టారీఫ్ ప్రపోజల్స్‌ను సమర్పించాలని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు కోరారు. 2022-23 ఏడాదికి సంబంధించి ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, సిరిసిల్ల సెస్ మూడు సంస్థలు ఇవాళ వార్షిక ఆదాయ అవసరాలను సమర్పించాయి. హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని ఈఆర్సీ కార్యాలయంలో ఏఆర్ఆర్కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. డిస్కంలు కేవలం ఏఆర్‌ఆర్‌లు మాత్రమే సమర్పించి.. టారీఫ్ ప్రపోజల్స్ సమర్పించకపోవటంపై అసహనం వ్యక్తం చేశారు. ఏఆర్ఆర్ మాత్రమే సమర్పించి.. టారీఫ్ ప్రపోజల్స్ ఇవ్వకపోతే ఈఆర్సీ ముందుకు పోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు..
వీలైనంత తొందరగా డిస్కంలు టారీఫ్ సమర్పిస్తే.. వాటిని తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు. ఆ తర్వాత ప్రజలకు తెలియజేసేందుకు పత్రికా ప్రకటన కూడా ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత షెడ్యూల్ నిర్ణయించి మార్చి 31లోపు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి.. కమిషన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందని శ్రీరంగారావు పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలవుతాయన్నారు. వీలైనంత త్వరగా డిస్కంలు విద్యుత్ టారీఫ్‌లు సమర్పించాలని సూచించారు.
డిస్కంలు సమర్పించిన లెక్కలు..
SPDCL and NPDCL ARR: రెండు డిస్కంలు(ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కలిపి 2021-22కు ఏఆర్ఆర్ రూ.45,618 కోట్లు, 2022-23కు సంబంధించి రూ.53,053 కోట్లు చూపించారని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ 2021-22 ఏడాదికి గానూ రెండు డిస్కంలు కలిపి రూ.5,652లు కోట్లు, 2022-23 ఏడాదికి గానూ రూ.5,652 కోట్లు చూపెట్టారని వివరించారు. రెండు డిస్కంలు సమర్పించిన లెక్కల వివరాలు...
- వార్షిక ఆదాయ అవసరాలు (అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్మెంట్) ఏఆర్ఆర్:
2021-22కు రూ.45,618 కోట్లు
2022-23కు రూ.53,053 కోట్లు
- రెవెన్యూ గ్యాప్ ఎస్పీడీసీఎల్ :
2021-22 ఏడాదికి రూ.7,008 కోట్లు