పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ నూతన కార్యాలయాలు ప్రారంభం - minister talasani srinivas yadav
తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ చొరవతో అందరి జీవితాలు బాగుపడ్డాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ శాఖల కార్యాలయాలు ప్రారంభించారు.
![పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ నూతన కార్యాలయాలు ప్రారంభం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4633477-699-4633477-1570081634975.jpg)
రెవెన్యూ అధికారులతో సమీక్ష చేసి నాణ్యమైన గొర్రెలు పంపిణీ చేస్తున్నామని, 20 కోట్ల చేపపిల్లలు పంపిణీ చేసిన ఘనత తెరాస ప్రభుత్వానిదేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. ఇక నుంచి అక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు సాగుతాయని వెల్లడించారు. హుజూర్‌నగర్‌లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు... ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఓటర్లను ప్రలోభ పెట్టాల్సిన అవసరం తెరాసకు లేదని స్పష్టం చేశారు.
- ఇదీ చూడండి : నేడు ఏవోబీ బంద్.. అప్రమత్తమైన పోలీసులు