తెలంగాణ

telangana

ETV Bharat / city

కొత్త మద్యం విధానం ప్రకటించిన ప్రభుత్వం

By

Published : Oct 3, 2019, 1:12 PM IST

Updated : Oct 3, 2019, 2:29 PM IST

కొత్త మద్యం విధానం

13:02 October 03

నవంబర్​ 1 నుంచి నూతన మద్యం విధానం అమలు

          రాష్ట్ర ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించింది. మద్యం దుకాణాలకు ఈ నెల 9 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది.  నూతన మద్యం విధానం నోటిఫికేషన్  ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్  విడుదల చేశారు. మద్యం దుకాణాలకు ఈ నెల 18వ తేదీన లాటరీ ద్వారా లైసెన్స్‌దారులను  ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 2019 నవంబర్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 2021 వరకు  ఈ విధానం అమల్లో ఉంటుంది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులుగా ప్రభుత్వం మార్చింది.   రాష్ట్రంలో 2,216 దుకాణాలకు లాటరీ పద్దతి ద్వారా ఎంపిక చేస్తారు. జనాభా ప్రాతిపదిన లైసెన్స్‌ ఫీజులు ఖరారు చేశారు. 

  • జనాభా ప్రాతిపదికన లైసెన్స్​ ఫీజు
  1. 5 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.50 లక్షల లైసెన్స్ ఫీజు
  2. 5 వేల నుంచి 50 వేల లోపు జనాభా ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ.55 లక్షలు 
  3. 50 వేల నుంచి లక్షల జనాభా ప్రాంతాల్లో లైసెన్స్ ఫీజు రూ.60 లక్షలు
  4. లక్ష జనాభా నుంచి 5 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు లైసెన్స్‌ ఫీజు రూ.65 లక్షలు
  5. 5 లక్షల నుంచి 20 లక్షలలోపు జనాభా ప్రాంతాలకు రూ.85 లక్షల లైసెన్స్‌ ఫీజు 
  6. 20 లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో లైసెన్స్‌ ఫీజు రూ1.10 కోట్లు 
  • మద్యం దుకాణాలు తెరచి ఉంచే సమయాలు నిర్దేశించిన ప్రభుత్వం 
  1. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉదయం 10 గం. నుంచి రాత్రి 11 గం.ల వరకు అనుమతి 
  2. ఇతర ప్రాంతాల్లో ఉదయం 10 గం.ల నుంచి రాత్రి 10 వరకు మద్యం దుకాణాలకు అనుమతి 
Last Updated : Oct 3, 2019, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details