స్వదేశీ యాప్‌ల ప్రోత్సాహంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడకు చెందిన వ్యక్తి రూపొందించిన యాప్‌కు రూ.15 లక్షల నగదు బహుమతి లభించింది. ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్ధి వంశీ జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా రూపొందించిన లిబిరో యాప్‌కు ఈ బహుమతి వచ్చింది. సోల్ఫేజ్ ఐటీ సొల్యూషన్ కంపెనీ సీటీవోతో పాటు మరో రెండు కంపెనీలకు కన్సెల్టెంట్ గా వంశీ వ్యవహరిస్తున్నారు.
జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా లిబిరో యాప్ - జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా లిబిరో యాప్ వార్తలు
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఛాలెంజ్‌లో ఏపీలోని కాకినాడకు చెందిన వంశీ తన సత్తా చాటాడు. జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా లిబిరో యాప్‌ను రూపొందించి ఔరా అనిపించాడు. ఈ కాంటెస్ట్‌లో లిబిరో యాప్ 5వ స్ఠానాన్ని దక్కించుకుని రూ.15 లక్షలు బహుమతి పొందింది.
![జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా లిబిరో యాప్ జూమ్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా లిబిరో యాప్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7978557-186-7978557-1594429281770.jpg)
జూమ్ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా లిబిరో యాప్
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ నిర్వహించిన ఛాలెంజ్‌కు గత ఏప్రిల్‌లో 2వేల మంది దరఖాస్తు చేసుకోగా.. వంశీ రూపొందించిన లిబిరో యాప్‌కు 5వ స్థానం లభించింది. జూమ్ యాప్‌తో పోలిస్తే లిబిరో యాప్ మెరుగైనదని వంశీ అంటున్నాడు.
ఇదీ చదవండి:75% ఇంటర్ మార్కుల నిబంధన ఎత్తివేత!