హైదరాబాద్ - బెంగళూరు నగరాల మధ్య మరో కొత్త పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకానుంది. తెలంగాణ- ఏపీ- కర్ణాటక రాష్ట్రాలలో ఈ కారిడార్ ఏర్పాటు ద్వారా విద్యుత్ పరికరాల తయారీ సహా ఇతర సాంకేతిక ఉత్పత్తుల పరిశ్రమలు వచ్చే అవకాశం ఉందని ఏపీ భావిస్తోంది. కేంద్ర సహకారంతో పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చేస్తామని ఏపీ పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (ఎన్ఐసీడీఐటీ) ద్వారా మరో కారిడార్‌కు కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
మూడు పారిశ్రామిక కారిడార్లు
హైదరాబాద్ - బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ నోడ్‌గా ఉండనుంది. కడప జిల్లాలోని కొప్పర్తి విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తమ్మినపట్నం, చిత్తూరు జిల్లాలోని రౌతుసురుమల నోడ్ ద్వారా చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కింద అభివృద్ధి కానుంది. ఈ కారిడార్‌తో కలిపి రాష్ట్రంలో 3 పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు కానున్నాయి. మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా పరిశ్రమలకు పుష్కలంగా నీటి సరఫరాతో పాటు ప్రత్యేక విద్యుత్ లైన్లు, లాజిస్టిక్ కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు.