తెలంగాణ

telangana

ETV Bharat / city

నేటినుంచి ముంబయి - చెన్నై - విశాఖ విమాన సర్వీసు - విశాఖ నుంచి ముంబయికి ెయిర్ ఏషియా విమాన సర్వీసు న్యూస్

ముంబయి నుంచి చెన్నై మీదుగా విశాఖకు ఎయిర్‌ ఏషియా సంస్థ విమాన సర్వీసును మంగళవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు విశాఖ విమానాశ్రయ అధికారులు తెలిపారు. లాక్​డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే కార్గో సేవలు మెరుగవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.

new-flight-services-to-mumbai-from-vishaka
ముంబయి - చెన్నై - విశాఖ విమాన సర్వీసు

By

Published : Oct 20, 2020, 3:06 PM IST

ఈ విమానం ప్రతీరోజూ తెల్లవారుజామున 5.40గంటలకు బయలుదేరి 7.40కి చెన్నై వెళ్లి అక్కడి నుంచి 9.50కి విశాఖ వస్తుంది. తిరిగి విశాఖలో ఉదయం 10.25కు బయలుదేరి చెన్నైకి 11.40కి, ముంబయికి 2.25కి చేరుకుంటుందని విమానాశ్రయ అధికారులు వివరించారు.

లాక్‌డౌన్‌ తర్వాత విశాఖ విమానాశ్రయం నుంచి కార్గో రవాణా కొద్దికొద్దిగా మెరుగవుతోంది. గత 5 నెలలుగా 1287.40 టన్నుల సరకును రవాణాచేసినట్లు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details