తెలంగాణ

telangana

ETV Bharat / city

New Districts issues in AP: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. పలు ప్రాంతాల్లో నిరసన సెగలు - తెలంగాణ వార్తలు

New Districts issues in AP : ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో.. పలు చోట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సౌకర్యాలు, అందరికీ అందుబాటు.. ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరే చోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. రాజంపేటను.. అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని రైల్వేకోడూరులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.

New Districts issues in AP, ap protest
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు.. పలు ప్రాంతాల్లో నిరసన సెగలు

By

Published : Jan 28, 2022, 1:15 PM IST

New Districts issues in AP : ఆంధ్రప్రదేశ్​లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఆరంభం కావడంతో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సరికొత్త డిమాండ్లు తెరపైకి వస్తుండగా.. పలు ప్రాంతాల్లో నిరసన సెగలూ రాజుకుంటున్నాయి. చారిత్రక ప్రాధాన్యం, సౌకర్యాలు, అందరికీ అందుబాటు.. ఇవన్నీ ఉన్న ప్రాంతాలను కాదని వేరేచోట్ల జిల్లా కేంద్రాల ఏర్పాటుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాల పేర్లపైనా అభ్యంతరాలు వస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తీరుపై విద్యార్థులు, సాధారణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. కడప జిల్లాలోని.. రాజంపేటను కాదని రాయచోటిని జిల్లా కేంద్రం చేయడంపై స్థానికులు పార్టీలకు అతీతంగా ఉద్యమానికి సిద్ధమయ్యారు.

రైల్వేకోడూరులో భారీ ర్యాలీ...

రైల్వేకోడూరులో విద్యార్థుల భారీ ర్యాలీ నిర్వహించారు. రాజంపేటను.. అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజంపేటలో విద్యార్థి, యువజన సంఘాల ఐకాస రాస్తారోకో చేపట్టారు. రాయచోటిని కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేశారు. కడప-తిరుపతి జాతీయ రహదారిపై.. రాజంపేట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద విద్యార్థి, యువజన సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. పోలీసులు ధర్నాలో పాల్గొనకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నప్పటికీ.. స్థానికులు, విద్యార్థులు రోడ్లపైనే బైఠాయించి ఆందోళనలు చేస్తున్నారు.

ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి ముట్టడి..

మరోవైపు మదనపల్లిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మదనపల్లె జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ తో ఎంపీ మిథున్ రెడ్డి ఇంటి ముట్టడికి అఖిలపక్ష సంఘాలు, మదనపల్లి జిల్లా సాధన సమితి ప్రయత్నించాయి. ఈ నేపథ్యంలో భారీగా మోహరించిన పోలీసులు.. ఎంపీ నివాస ముట్టడి యత్నాలను అడ్డుకున్నారు. మిథున్ రెడ్డి ఇంటి వైపు వెళుతున్న సాధన సమితి నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి:New Districts in AP: ఏపీలో కొత్త జిల్లాలపై త్వరలో గెజిట్‌ నోటిఫికేషన్లు

ABOUT THE AUTHOR

...view details