Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,384 కరోనా కేసులు, 17 మరణాలు - telangana covid cases
20:35 June 02
Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 2,384 కరోనా కేసులు, 17 మరణాలు
రాష్ట్రవ్యాప్తంగా లక్షా 8 వేల 696 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... 2,384 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో 1847 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. ఇక తాజాగా పాజిటివ్‌లతో కలిపి ఇప్పటి వరకు 5,83,228 మందికి వైరస్ సోకింది. మరో 2,242 మంది కోలుకోగా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 546536 మంది సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా 17 మందిని కరోనా బలితీసుకోగా వైరస్ మరణాలు 3,313కి పెరిగాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో 33,379 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక తాజాగా వచ్చిన కేసులలో ఆదిలాబాద్ 11, భద్రాద్రి కొత్తగూడెం 113, జీహెచ్ఎంసీ 307, జగిత్యాల 41, జనగామ 33, జయశంకర్ భూపాలపల్లి 57, జోగులాంబ గద్వాల్ 44, కామారెడ్డి 13, కరీంనగర్ 103, ఖమ్మం 167, ఆసిఫాబాద్ 15, మహబూబ్ నగర్ 81, మహబూబాబాద్ 94, మంచిర్యాల 75, మెదక్ 23, మేడ్చల్ మల్కాజ్గిరి 116, ములుగు 45, నాగర్‌కర్నూల్ 28, నల్గొండ 170, నారాయణ పేట్ 13, నిర్మల్ 9, నిజామాబాద్ 21, పెద్దపల్లి 95, రాజన్న సిరిసిల్ల 45, రంగారెడ్డి 135, సంగారెడ్డి 59, సిద్దిపేట 102, సూర్యాపేట 90, వికారాబాద్ 54, వనపర్తి 45, వరంగల్ రూరల్ 63, వరంగల్ అర్బన్ 86, యాదాద్రి భువనగిరిలో 31 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.