రాష్ట్రంలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. నిన్న 58,029 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా... కొత్తగా మరో 495 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా... మహమ్మారికి ఇద్దరు బలయ్యారు. కొవిడ్ నుంచి కొత్తగా 247 మంది బాధితులు కోలుకున్నారు.
మళ్లీ విజృంభిస్తున్న కరోనా... తాజాగా 495 కేసులు నమోదు - కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగాపెరిగిపోతున్నాయి. రెండో దశ ప్రభావమో... ప్రజల నిర్లక్ష్యమో... వైరస్ వ్యాప్తి మాత్రం వేగంగా జరుగుతోంది. తాజాగా రాష్ట్రంలో 495 కొత్త కేసులు నమోదవటమే ఇందుకు నిదర్శనం.
new corona cases telangana
మరోవైపు క్రమంగా కరోనా క్రియాశీల కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం 4,241 కరోనా యాక్టివ్ కేసులుండగా... ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 1,870 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 142 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.