రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 55వేల 892 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 2వేల 296 మందికి వైరస్ సోకింది. మరో 1,388 మందికి సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉన్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో ఇప్పటి వరకు లక్షా 77వేల 70మందికి కరోనా సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరో 2062 మందికి కోలుకోగా ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య లక్షా 46వేల 135కి పెరిగింది.
రాష్ట్రంలో కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు - corona cases in telangana
08:42 September 23
రాష్ట్రంలో కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు
ఇక తాజాగా 10మంది మహమ్మారికి బలవ్వగా... ఇప్పటి వరకు వెయ్యి 62మంది వైరస్‌తో చనిపోయినట్టు వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 29వేల 873మంది వైరస్ బాధితులు ఉండగా... అందులో 23వేల 527మంది కేవలం హోంఐసోలేషన్లో ఉన్నారు. ఇక ఇప్పటి వరకు మహమ్మారి రిన పడిన వారిలో లక్షా 23వేల 949మందిలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేకపోవటం గమనార్హం. అంటే సుమారు 70శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ బారిన పడుతున్నారని.... కేవలం 30శాతం మందిలో మాత్రమే జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరస్ లక్షణాలు ఉంటున్నాయని వైద్య ఆరోగ్య శాఖ నివేదికల్లో తేటతెల్లమవుతోంది.
తాజాగా ఆదిలాబాద్‌లో 18, భద్రాద్రి కొత్తగూడెంలో 77, జీహెచ్ఎంసీలో 321, జగిత్యాల 50, జనగామ 36, భూపాలపల్లి 11, గద్వాల 21, కామారెడ్డి 77, కరీంనగర్ 136, ఖమ్మం 69, ఆసిఫాబాద్ 16, మహబూబ్ నగర్ 31, మహబూబాబాద్ 72, మంచిర్యాల 37, మెదక్ 23, మల్కాజ్ గిరి 173, ములుగు 24, నాగర్ కర్నూల్ 36, నల్గొండ 155, నారాయణ్ పేట్ 6, నిర్మల్ 19, నిజామాబాద్ 82, పెద్దపల్లి 40, సిరిసిల్ల 67, రంగారెడ్డి 217, సంగారెడ్డి 81, సిద్దిపేట 92, సూర్యాపేట 73, వికారాబాద్ 23, వనపర్తి 37, వరంగల్ రూరల్ 30, వరంగల్ అర్బన్ 99, యాదాద్రి భువనగిరిలో 47 చొప్పున కేసులు వెలుగుచూశాయి.
ఇదీ చూడండి: కరోనా పంజా: ఒక్కరోజులో 2.72లక్షల కొత్త కేసులు