రాష్ట్రంలో కొత్తగా 2,216 కరోనా కేసులు, 11 మరణాలు - covid deaths
09:02 September 13
రాష్ట్రంలో కొత్తగా 2,216 కరోనా కేసులు, 11 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,216 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,57,096కు చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 341 కరోనా బారిన పడ్డారు. 11 మంది మహమ్మారి బారిన పడి మరణించగా... మొత్త మృతుల సంఖ్య 961కి చేరింది. కొవిడ్ నుంచి 2,603 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలుపుకుని ఇప్పటివరకు 1,24,528 మంది బాధితులు మహమ్మారిని జయించి ఆరోగ్యవంతులయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 31,607 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న 24,674 మంది బాధితులున్నట్లు పేర్కొన్నారు.