తెలంగాణ

telangana

ETV Bharat / city

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 3,801 కేసులు - new covid cases

new corona cases in telangana today
new corona cases in telangana today

By

Published : Jan 26, 2022, 7:04 PM IST

Updated : Jan 26, 2022, 8:44 PM IST

19:02 January 26

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి.. కొత్తగా 3,801 కేసులు

Telangana Corona Cases: రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 88,867 మందికి కొవిడ్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 3,801 మందికి మహమ్మారి సోకినట్టు నిర్ధరణైంది. ఒక్క జీహెచ్​ఎంసీ పరిధిలోనే 1,570 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మహమ్మారి కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం కొవిడ్​ మరణాల సంఖ్య 4,078కి చేరింది.

వైరస్​ నుంచి మరో 1,961 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,023 క్రియాశీల కేసులున్నాయి. కరోనా మహమ్మారి పట్ల ప్రజలు అలసత్వం వహించొద్దని వైద్యారోగ్య శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని చెబుతున్నారు.

Corona cases in India: భారత్​లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య కాస్త పెరిగింది. తాజాగా 2,85,914 కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 665 మంది మరణించారు. 2,99,073 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.16 శాతానికి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసులు 4 లక్షలు దాటాయి.

  • మొత్తం కేసులు:4,00,85,116
  • మొత్తం మరణాలు:4,91,127
  • యాక్టివ్ కేసులు:22,23,018
  • మొత్తం కోలుకున్నవారు:3,73,70,971

ఇదీ చూడండి:

Last Updated : Jan 26, 2022, 8:44 PM IST

ABOUT THE AUTHOR

...view details