TS Corona Cases: రాష్ట్రంలో కొత్తగా 315 కరోనా కేసులు.. ఇద్దరు మృతి - telangana corona cases
19:08 September 09
రాష్ట్రంలో కొత్తగా 315 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75 వేల 199 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 315 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు లక్షల ఆరవై వేల 786 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ బారిన పడి తాజాగా ఇద్దరు మరణించగా.. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మూడు వేల 891కి చేరింది. కొవిడ్ నుంచి మరో 340 మంది కోలుకోగా.. మొత్తం ఆరు లక్షల 51 వేల 425 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం 5,470 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండగా.. మరికొందరు ఆస్పత్రుల్లో ఉన్నారు. కేవలం జీహెచ్ఎంసీలోనే 83 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: