రాష్ట్రంలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. 38 మంది మృతి - రాష్ట్రంలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. 38 మంది మృతి
17:49 May 08
రాష్ట్రంలో కొత్తగా 5,186 కరోనా కేసులు.. 38 మంది మృతి
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా మరో 5,186 కరోనా కేసులు నమోదు కాగా... మహమ్మారి బారిన పడి 38 మంది మృత్యువాతపడ్డారు. కొవిడ్ నుంచి మరో 7,994 మంది బాధితులు కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 68,462 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 904 కరోనా కేసులు నమోదు కాగా... రంగారెడ్డి జిల్లాలో 399, మేడ్చల్ జిల్లాలో 366 మంది కొవిడ్ బారిన పడ్డారు.