రాష్ట్రంలో కొత్తగా 1,539 కరోనా కేసులు, 5 మరణాలు
08:43 November 05
రాష్ట్రంలో కొత్తగా 1,539 కరోనా కేసులు, 5 మరణాలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 1539 మందికి కొవిడ్ సోకగా... ఇప్పటి వరకు మొత్తం 2,45,682 మందికి వైరస్ సోకినట్టు వైద్య ఆరోగ్య శాఖ నిర్ధరించింది. గడిచిన 24 గంటల్లో 978మంది కోలుకోగా... మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,25,664 కి చేరింది. మరో 5 మంది మహమ్మరి బారిన పడి మృతి చెందగా... మొత్తం కరోనా మరణాలు 1362కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 18656 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 15,864 మంది ఐసోలేషన్లో ఉండటం గమనార్హం.
ఇక తాజాగా నమోదైన కరోనా కేసుల్లో ఆదిలాబాద్ 14, కొత్తగూడెం 82, జీహెచ్ఎంసీ 285, జగిత్యాల 45, జనగామ 22, భూపాలపల్లి 12, జోగులాంబ గద్వాల 13, కామారెడ్డి 36, కరీంనగర్ 86, ఖమ్మం 78, ఆసిఫాబాద్ 04, మహబూబ్నగర్ 43, మహబూబాబాద్ 21, మంచిర్యాల 33, మెదక్ 23, మల్కాజిగిరి 102, ములుగు 32, నాగర్కర్నూల్ 33, నల్గొండ 69, నారాయణపేట్ 1, నిర్మల్ 20, నిజామాబాద్ 37, పెద్దపల్లి 39, సిరిసిల్ల 33, రంగరెడ్డి 123, సంగారెడ్డి 40, సిద్దిపేట 38, సూర్యాపేట 52, వికారాబాద్ 12, వనపర్తి 13, వరంగల్ రూరల్ 29, వరంగల్ అర్బన్ 46, భువనగిరి 23 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్న దృష్ట్యా ఫ్లూ, జ్వరం లక్షణాలు ఉన్న వారు తప్పక కరోనా పరీక్షలు చేయించుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
- ఇదీ చూడండి:'ఆగస్టు కల్లా 25 కోట్ల మందికి కొవిడ్ టీకా'