రాష్ట్రంలో కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు - new corona cases in telangana today
08:27 September 22
రాష్ట్రంలో కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు
రాష్ట్రంలో కరోనా కేసులు నిన్న కాస్తా తగ్గుముఖం పట్టినప్పట్టికీ నేడు మళ్లీ పెరిగిపోయాయి. రాష్ట్రంలో కొత్తగా 2,166 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 309 కరోనా కేసులు నమోదు కాగా... వీటితో కలిపి కరోనా కేసుల సంఖ్య 1,74,774కు చేరింది. కొవిడ్బారిన పడి 1052 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో కరోనా నుంచి మరో 2,143 మంది బాధితులు కోలుకోగా... వారి సంఖ్య 1,44,073 మందికి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 29,649 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు అధికారులు వెల్లడించారు. హోం ఐసోలేషన్‌లో 22,620 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.