ఏపీలో గత 24 గంటల్లో 28,268 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 70 మందికి పాజిటివ్ వచ్చింది. 84 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. విశాఖపట్నంలో ఒకరు మరణించారు. చిత్తూరులో అత్యధికంగా 18 కేసులు నమోదు కాగా.. కర్నూలులో ఒక్కరికీ మహమ్మారి సోకలేదు. తూర్పుగోదావరి విశాఖపట్నంలో 9, కృష్ణాలో 7, నెల్లూరులో 6, గుంటూరులో 5, పశ్చిమగోదావరి శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 3, అనంతపురం ప్రకాశంలో 2, కడపలో ఒకరు చొప్పున కేసులు నమోదయ్యాయి.
ఏపీలో కొత్తగా 70 మందికి సోకిన కరోనా - రాష్ట్రంలో 23.02.2021న కొత్త కరోనా కేసులు
గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 70 మందికి కరోనా సోకింది. 84 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లారు. విశాఖపట్నంలో ఒకరు మరణించారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 8,89,409 మంది కొవిడ్ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఏపీలో కొత్తగా 70 మందికి సోకిన కరోనా
ఇప్పటి వరకు మొత్తం 1,37,75,253 రోగుల నమూనాలు పరిశీలించగా.. 8,89,409 మందికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 8,81,666 మంది కొవిడ్ బారినుంచి కోలుకున్నట్లు వెల్లడించింది. మరో 575 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 7,168 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టం చేసింది.