గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 96,121 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 4,147 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు తెలిపారు. వీటితో పాటు 38 మరణాలు నమోదయ్యాయి. ఏపీలో కరోనా నుంచి మరో 5,773 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం 46,126 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ap corona cases: కొత్తగా 4,147 కరోనా కేసులు, 38 మరణాలు - తెలంగాణ వార్తలు
ఏపీలో గడిచిన 24 గంటల్లో 4,147 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారితో 38 మంది మృతి చెందారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం 46,126 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఏపీ కరోనా కేసులు, కొవిడ్ కేసులు
కొవిడ్ కారణంగా చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. ఆ రాష్ట్రంలో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 838, పశ్చిమగోదావరి జిల్లాలో 571, చిత్తూరు జిల్లాలో 569 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:CORONA CASES: కొత్తగా 1,028 కరోనా కేసులు, 9 మరణాలు
Last Updated : Jun 26, 2021, 7:57 PM IST