తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 2,949 కరోనా కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో 2,949 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,14,774కు చేరింది. మృతుల సంఖ్య 6,643కి ఎగబాకింది.

new-corona-case-in-andhrapradhesh
ఏపీలో కొత్తగా 2,949 కరోనా కేసులు నమోదు

By

Published : Oct 28, 2020, 9:06 PM IST

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్​లో 2,949 కరోనా కేసులు, 18 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,14,774కు చేరింది. మృతుల సంఖ్య 6,643కి ఎగబాకింది. వైరస్ నుంచి ఈరోజు 3,609 మంది కోలుకోగా... ఇప్పటి వరకు 7,81,509 మంది బాధితులు కరోనాను జయించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 26,622 క్రియాశీల కేసులున్నట్టు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77.73 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.

జిల్లాల వారీగా కరోనా మృతులు...
కొవిడ్​తో అనంతపురం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందగా... చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

జిల్లాల వారీగా కరోనా కేసులు...
పశ్చిమగోదావరిలో అత్యధికంగా 492 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణాలో 457, తూర్పుగోదావరిలో 417, గుంటూరులో 421, చిత్తూరులో 315, కడపలో 193, అనంతపురంలో 192 మందికి వైరస్ నిర్ధరణ అయింది. విశాఖలో 114, ప్రకాశంలో 99, నెల్లూరులో 76 మందికి వైరస్ సోకింది. శ్రీకాకుళంలో 74, విజయనగరంలో 67, కర్నూలులో 32 కొవిడ్ కేసులు బయటపడ్డాయి.

ఇదీ చూడండి:దంత వైద్యుడి అపహరణ కేసులో ఏడుగురు అరెస్ట్‌

ABOUT THE AUTHOR

...view details