New commissioner to Rachakonda: రాచకొండ కమిషనరేట్‌కు త్వరలోనే కొత్త బాస్ రానున్నారు. సుదీర్ఘకాలంగా కమిషనర్‌గా పనిచేస్తున్న మహేశ్‌భగవత్‌కు స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. 2016 జూన్‌లో రాచకొండ కమిషనరేట్ ఏర్పడినప్పుడు తొలి కమిషనర్‌గా మహేశ్ భగవత్ బాధ్యతలు స్వీకరించారు. ఏడు సంవత్సరాలుగా ఆయనే కొనసాగుతున్నారు. తెలంగాణలో ఇంత సుదీర్ఘకాలం ఒకే ఫోకల్ పోస్టింగ్‌లో కొనసాగిన ఐపీఎస్‌లు మరెవరూ లేరు. ఈ నేపథ్యంలో గతంలో ఐపీఎస్‌ల బదిలీలు జరిగినప్పుడల్లా ఆయనకు స్థానచలనం కలుగుతుందని ప్రచారం నెలకొంది.
రాచకొండకు త్వరలో కొత్త కమిషనర్, ఎందుకంటే - మహేశ్ భగవత్ తాజా సమాచారం
New commissioner to Rachakonda రాచకొండ కమిషనరేట్‌కు త్వరలోనే కొత్త కమిషనర్ రానున్నారు. సుదీర్ఘకాలంగా కమిషనర్‌గా పనిచేస్తున్న మహేశ్‌భగవత్‌కు స్థానచలనం కలిగే అవకాశాలున్నాయి. అందుకు మునుగోడు ఉపఎన్నిక నేపథ్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కొత్త కమిషనర్‌గా ఎవరిని నియమిస్తారనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.
ఈసారి మాత్రం ఆయన బదిలీ ఉంటుందని పోలీస్‌వర్గాల్లో చర్చ జరుగుతోంది. అందుకు మునుగోడు ఉపఎన్నిక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మునుగోడు శాసనసభ నియోజకవర్గంలోని చౌటుప్పల్, నారాయణపూర్ మండలాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. ఎన్నికల నియామవళి అమల్లోకి వస్తే రెండేళ్లకంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగానే కొత్త కమిషనర్‌ను నియమించే అవకాశాలున్నాయని ఉన్నతాధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొత్త కమిషనర్‌గా ఎవరిని నియమిస్తారనే విషయంలో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది.