తెలంగాణ

telangana

ETV Bharat / city

మరింత ఆకర్షణగా నెహ్రూ జంతు ప్రదర్శన శాల - zoo

హైదరాబాద్​లో నెహ్రూ జంతు ప్రదర్శనలో అదనపు పక్షుల కేంద్రాన్ని నిర్మించేందుకు అటవీ శాఖ అధికారులు శంకుస్థాపన చేశారు.

భూమి పూజ చేస్తూ

By

Published : Apr 19, 2019, 4:59 AM IST

హైదరాబాద్​ నెహ్రూ జంతు ప్రదర్శన శాలకు అదనపు ఆకర్షణలు తోడవనున్నాయి. ఇప్పటికే ఉన్న పక్షుల కేంద్రానికి అదనంగా మరో సందర్శన కేంద్రాన్ని నిర్మించేందుకు అటవీ శాఖ అధికారి పీసీసీఎఫ్​ పీకే ఝూ శంకుస్థాపన చేశారు. ఇటీవలే కోల్​కతా నుంచి తీసుకొచ్చిన రెండు జిరాఫీలను సందర్శకులు చూసేందుకు వీలుగా ఎన్​క్లోజర్​లోకి విడిచిపెట్టారు. జూ పార్కులో జిరాఫీల సంఖ్య మూడుకు చేరింది. జూ లో నూతనంగా ఏర్పాటుచేసిన రెప్టైల్​ ఎన్​క్లోజర్​, పాత పక్షల కేంద్రం చుట్టూ నడుస్తూ వెళ్లేలా నిర్మిస్తున్న అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు.

మరింత ఆకర్షణగా నెహ్రూ జంతు ప్రదర్శన శాల


దేశంలోనే పేరొందిన నెహ్రూ జంతు ప్రదర్శన శాల మరింత ఆకర్షణీయంగా తయారవనుందని అధికారులు తెలిపారు. మరింత మెరుగైన వసతులు కల్పించే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇవీ చూడండి: ప్రపంచకప్​లో పాల్గొనే సఫారీ జట్టిదే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details