తెలంగాణ

telangana

ETV Bharat / city

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు - టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు

'ఐ లాబ్​' పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించిన కేసులో సైబర్​ క్రైం పోలీసులు పలు సెక్షన్​లపై కేసు నమోదు చేశారు. కూకట్​పల్లి 16వ మినిస్టీరియల్​ మెజిస్ట్రేట్​ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు

By

Published : Oct 17, 2019, 2:12 PM IST

Updated : Oct 17, 2019, 7:23 PM IST

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్​ను ఈరోజు కూకట్​పల్లి కోర్టులో సైబరాబాద్ ఐటి వింగ్ పోలీసులు హాజరుపరిచారు. రవిప్రకాష్​పై ఐపీసీ సెక్షన్ 406, ఐటీ చట్టం సెక్షన్ 66డీ ప్రకారం నేరభియోగాలు నమోదు చేశారు. గతంలో రవిప్రకాష్ ఐ లాబ్ పేరుతో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద నకిలీ గుర్తింపు ఐడీ కార్డును సృష్టించినట్లు సమాచారం. చంచల్​గూడ జైలు నుండి పిటి వారెంట్​పై రవిప్రకాష్​ను ఈ రోజు కూకట్​పల్లి 16వ మినిస్టీరియల్​ మెజిస్ట్రేట్​ కోర్టులో హాజరుపరచగా, కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు రవిప్రకాశ్​ను చంచల్ గూడ జైలుకు తరలించారు. రవిప్రకాష్ తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు నిరాకరించింది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌పై మరో కేసు నమోదు
Last Updated : Oct 17, 2019, 7:23 PM IST

ABOUT THE AUTHOR

...view details