మైక్రోసాఫ్ట్ మరోటి..
Microsoft Teams
మరింత ప్రొఫెషనల్‌గా నెట్టింట్లో మీటింగ్‌లు పెట్టుకుందాం అనుకుంటే ‘మైక్రోసాఫ్ట్ టీమ్స్’ వేదికలో సభ్యులవ్వొచ్ఛు సుమారు 250 మంది వరకు మీటింగ్‌లో పాల్గొనొచ్ఛు యూజర్ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగకుండా కట్టుదిట్టమైన సెక్యూరిటీ వలయంలో వీడియో సమావేశాల్ని ఏర్పాటు చేసుకోవచ్ఛు మాట్లాడుతూనే టెక్స్ట్ మెసేజ్‌లు పంపొచ్ఛు సమావేశం జరుగుతున్నప్పుడే ‘ఆఫీస్ డాక్యుమెంట్స్’ని సులభంగా షేర్ చేసుకోవచ్ఛు అందుకు సంబంధించిన క్లౌడ్ స్పేస్‌ని మైక్రోసాఫ్ట్ అందిస్తోంది.
'డాక్యుమెంట్’ పనుల కోసం..
bit
చేస్తున్న ఉద్యోగం ఏదైనా ‘డాక్యుమెంట్’లకు సంబంధించిన పని ఉంటే.. అందుబాటులో ఉన్న క్లౌడ్ సర్వీసుల్ని వాడుకుని చేయొచ్ఛు ఉదాహరణకు గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్.. వీటిల్లోకి లాగిన్ అయ్యి డాక్యుమెంట్‌లను క్రియేట్ చేయొచ్ఛు ఎడిటింగ్ చేసి పంపాల్సిన వారితో పంచుకోవచ్ఛు అయితే, ఆయా సర్వీసుల్లో కచ్చితంగా సభ్యులై ఉంటేనే వాటిని వాడుకోగలరు. షేర్ చేసిన లింక్‌లను ఓపెన్ చేయగలరు. మరైతే, బృందంతో పని చేసేటప్పుడు ఎలా? వారిలో ఒక్కొక్కరూ ఒక్కో క్లౌడ్ సర్వీసు వాడితే.. అందరూ ఒకే చోట చేరి కలిసి పని చేయాలంటే? అందుకు తగినదే ఈ ‘బిట్’ సర్వీస్. గూగుల్ డ్రైవ్, వన్‌డ్రైవ్, డ్రాప్‌బాక్స్, బాక్స్... లాంటి అన్ని రకాల క్లౌడ్ సర్వీసుల్ని సపోర్టు చేస్తుంది. సర్వీసులో రిజిస్టర్ అయ్యాక బృంద సభ్యుల్ని దీంట్లోకి ఆహ్వానించొచ్ఛు తర్వాత ‘వర్క్‌స్పేస్’లను క్రియేట్ చేసి పని ప్రారంభించొచ్ఛు అన్ని రకాల ఫైల్ ఫార్మెట్‌లను బిట్ సపోర్టు చేస్తుంది. మీరు ఏ రంగంలో పని చేస్తున్న అందుకు తగిన సర్వీసుల్ని ఎంపిక చేసుకుని వాడుకోవచ్ఛు ఉచిత ఎకౌంట్‌లో 50 మందిని బృందంగా జత చేయొచ్ఛు ఉచితంగా 1జీబీ స్టోరేజ్‌ని పొందొచ్ఛు క్రియేట్ చేసిన డాక్యుమెంట్‌లను పాస్‌వర్డ్‌లతో సురక్షితం చేయొచ్ఛు.
గూగుల్ ‘మీట్’ వాడితే...
Google Meet
ఇంట్లో నుంచే సమావేశాలు.. ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహించేందుకు గూగుల్ అందించే ‘మీట్’ సర్వీస్‌ని వాడొచ్ఛు నెట్టింట్లో ఎన్నో అనుమానాలు, సెక్యూరిటీ విశ్లేషణలకు దారి తీసిన ‘జూమ్’కి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు గూగుల్ మీట్‌కే మొగ్గు చూపుతున్నారు నెటిజన్లు. వాడుతున్న జీమెయిల్‌తోనే (జి-సూట్ యూజర్లుకు మాత్రమే)సరాసరి ‘మీట్’లోకి లాగిన్ అయ్యే వీలుంది. మీటింగ్స్‌లో 16 మంది వరకూ పాల్గొనొచ్ఛు క్రోమ్ వెబ్ స్టోర్‌లోని ఎక్స్‌టెన్షన్స్‌తో అదనపు సౌకర్యాల్ని ‘మీట్’కి జత చేయొచ్ఛు ఉదాహరణకు 'Nod' ఎక్స్‌టెన్షన్‌ని తీసుకోండి. దీంతో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడి అంతరాయం కలిగించకుండా.. అభిప్రాయం, ప్రశ్నల్ని చాట్ రూపంలో తెలపొచ్ఛు వింటున్న వీడియో క్లాస్‌లో ఏదైనా సందేహం ఉంటే.. తరగతి గదిలో చెయ్యి ఎత్తినట్టుగా ఎమోజీ రూపంలో మెసేజ్ పెట్టొచ్ఛు ఎక్స్‌టెన్షన్‌ని ప్రయత్నిద్దాం అనుకుంటే https://bit.ly/3bhEIHy లింక్‌ని చూడండి.
టెక్స్ట్ మెసేజ్‌లతోనే..
Slack
రంగం ఏదైనా.. బృందాలుగా ఏర్పడి పని చేస్తుంటారు. అలాంటప్పుడు ఎవరు ఎక్కడున్నా అనునిత్యం చాటింగ్ ద్వారా విధి నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునేందుకు ప్రత్యేక వేదిక కావాలనుకుంటే ఈ సర్వీస్‌ని వాడొచ్ఛు వందల సంఖ్యలో ఉద్యోగులు ఉన్నప్పుడు క్షణాల్లో సమాచారాన్ని చేరవేసేందుకు ఇదో చక్కని వేదిక. నలుగురు వ్యక్తులు గ్రూపుగా ఏర్పడి కాల్స్‌ని కూడా మాట్లాడుకోవచ్ఛు డాక్యుమెంట్‌లు షేర్ చేసుకోవచ్ఛు జీసూట్, ఆఫీస్ 365, డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్.. ఇలా వాడుతున్న క్లౌడ్ స్పేస్ ఏదైనా దీంతో సింక్ చేసుకుని ఫైల్స్‌ని యాక్సెస్ చేయొచ్ఛు.
‘ప్రాజెక్టు’ల్లో భాగంగా..
Heyspace
అంకుర సంస్థ కావచ్ఛు. పెద్ద కంపెనీలో మీరో ప్రాజెక్టు లీడర్ అయ్యుండొచ్ఛు ఇంటి పట్టునే ఉండి బృందం మొత్తం చేపట్టిన ప్రాజెక్టుని ఎలా చేస్తున్నారు? ఎంత వరకూ పూర్తి చేశారు? వారికి తగిన సూచనలు చేయడానికి సరైన ప్లాట్‌ఫామ్ కావాలంటే.. ‘హెస్పేస్’ సర్వీసుని ప్రయత్నించొచ్ఛు చేపట్టిన ప్రాజెక్టు పలు విభాగాలుగా విభజించి బృందాన్ని మానిటర్ చేయొచ్ఛు ఒకరికొకరు మాట్లాడుకోవచ్ఛు డేటాని పంచుకోవచ్ఛు చేయాల్సిన పనుల్ని ఫాలోఅప్ చేయొచ్ఛు అవసరం నిమిత్తం ‘గెస్ట్’ రూపంలో ఇతరుల్ని ప్రాజెక్టులోకి ఆహ్వానించొచ్ఛు ఉచిత ఎకౌంట్‌లో పది మంది బృందాన్ని, ఐదుగురు గెస్ట్‌లను ప్రాజెక్టులోకి ఆహ్వానించొచ్ఛు 10 క్లౌడ్ స్పేస్‌ని పొందొచ్ఛు ఫోన్‌లలోనే కాకుండా డెస్క్‌టాప్ కంప్యూటర్‌లలోనూ అప్లికేషన్ టూల్‌లా ఇన్‌స్టాల్ చేసుకుని వాడుకోవచ్ఛు.