తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు.. ఒకరు మృతి - ap covid updates

ఏపీలో కొత్తగా 172 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 39 మందికి కొవిడ్ పాజిటివ్​గా తెలింది.

corona
corona

By

Published : Jan 26, 2021, 8:58 PM IST

Updated : Jan 27, 2021, 10:18 PM IST

గడిచిన 24 గంటల్లో ఏపీలో 172 మందికి కరోనా సోకినట్టుగా ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 8,87,238కి చేరింది. 1,357 యాక్టివ్ కేసులున్నాయి.

గడిచిన 24 గంటల్లో కొవిడ్​తో కడపలో ఒకరు మరణించారు. ఇప్పటివరకు 7,150 మంది కరోనాతో మృతి చెందారు. గత 24 గంటల వ్యవధిలో 203 మంది.. వైరస్ బారినుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,78,731కి చేరింది.

కృష్ణా జిల్లాలో 39, విశాఖపట్నంలో 34, గుంటూరులో 22, చిత్తూరులో 11, కడపలో 15, తూర్పుగోదావరిలో 21, శ్రీకాకుళం 10, అనంతపురంలో 7, పశ్చిమగోదావరిలో 5, ప్రకాశంలో 4, కర్నూలులో 1, నెల్లూరులో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక కేసులు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి:భారత్​లో భారీగా తగ్గిన కరోనా కేసులు

Last Updated : Jan 27, 2021, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details