ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 1392 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8,44,359కు చేరింది. తాజాగా వైరస్ బారినపడి మరో 11 మంది మృతి చెందారు. మెుత్తం మరణాల సంఖ్య6,802గా ఉంది. కొవిడ్ నుంచి మరో 1,549 మంది కోలుకున్నారు. మొత్తం బాధితుల సంఖ్య 8.16 లక్షల మందిగా నమోదైంది. రాష్ట్రంలో ప్రస్తుతం 21,235 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 85.87 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు బులెటిన్లో పేర్కొంది.
ఏపీలో కొత్తగా 1392 కరోనా కేసులు.. 11 మరణాలు - latest ap corona case
ఏపీలో కొత్తగా 1392 కేసులు నమోదు కాగా.. 11 మంది మృతి చెందారు. ప్రస్తుతం 21,235 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఏపీలో కొత్తగా 1392 కరోనా కేసులు.. 11 మరణాలు
కొత్త కేసులు నమోదైన వాటిలో తూర్పుగోదావరి జిల్లాల్లో 341, పశ్చిమ గోదావరి 243, గుంటూరు 116, చిత్తూరు 105, కడప 100, అనంతపురం 84, నెల్లూరు 76, కృష్ణా 75, ప్రకాశం 66, విజయనగరం 61 కేసులు నిర్ధరణ అయ్యాయి.