నెదర్లాండ్‌కు చెందిన నిపుణుల బృందం హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను సందర్శించింది. టీహబ్‌ను పరిశీలించిన అనంతరం బషీర్ భాగ్‌లోని కమిషనరేట్ కార్యాలయానికి విచ్చేశారు. వారికి కమిషనర్ అంజనీ కుమార్ స్వాగతం పలికారు. కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం, సీసీ కెమెరాల పనితీరు, ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి అంజనీ కుమార్ వివరించారు. బందోబస్తు సమయాల్లో పోలీసుల విధులు, అప్రమత్తత వంటి అంశాలను చెప్పారు. హైదరాబాద్ గ్లోబల్ సీటీగా మారుతోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ కమిషనరేట్ సందర్శించిన నెదర్లాండ్ నిపుణుల బృందం - Netherland team visit hyderabad cp office
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌ను నెదర్లాండ్‌కు చెందిన నిపుణుల బృందం సందర్శించింది. కమిషనరేట్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ కేంద్రం, సీసీ కెమెరాల పనితీరు, ఉపయోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం గురించి వారికి అంజనీ కుమార్ వివరించారు.

hyderabad police commissionerate