తెలంగాణ

telangana

ETV Bharat / city

'నేరేడ్​మెట్​లో ఫలితాన్ని నిలిపివేయడానికి వారే కారణం' - నేరేడ్​మెట్ భాజపా అభ్యర్థి ప్రసన్ననాయుడు తాజా వార్తలు

బల్దియా ఎన్నికల్లో నేరేడ్​మెట్ 136వ డివిజన్ ఫలితాన్ని నిలిపివేయడానికి రిటర్నింగ్ అధికారులే కారణమని భాజపా అభ్యర్థి ప్రసన్ననాయుడు ఆరోపించారు. చెల్లని ఓట్లను తెరాస డబ్బాలో వేయండని ఎలక్షన్ అధికారులు చెప్పడంతోనే తాను అభ్యంతరం తెలిపినట్లు స్పష్టం చేశారు.

neredmet division bjp candidate  prasanna naidu demands repoling
'నేరేడ్​మెట్​లో పలితాన్ని నిలిపివేయడానికి వారే కారణం'

By

Published : Dec 6, 2020, 2:28 PM IST

నేరేడ్​మెట్ 136వ డివిజన్ ఫలితాన్ని హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల అధికారులు నిలిపివేయడంపై డివిజన్ భాజపా అభ్యర్థి ప్రసన్ననాయుడు స్పందించారు. ఫలితం నిలిపివేయడానికి రిటర్నింగ్ అధికారులే కారణమని ఆమె ఆరోపించారు. రిపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

కౌంటింగ్ చేసేప్పుడు '500 పైగా చెల్లని ఓట్లను తెరాస డబ్బాలో వేయండి' అని ఎలక్షన్ అధికారులు చెప్పడంతో అభ్యంతరం తెలిపానని ప్రసన్ననాయుడు స్పష్టం చేశారు. స్వస్తిక్ ముద్ర లేకుండా ఏదో ఒక ముద్ర ఇవ్వడం న్యాయమా అని ప్రశ్నించారు. తనను ఎలాగైన ఓడించాలని మల్కాజ్​గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కుట్ర చేశారని ఆరోపించారు.

ఇదీ చూడండి:ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా భాజపాదే విజయం: లక్ష్మణ్‌

ABOUT THE AUTHOR

...view details