దాదాపు నడుములోతు నీళ్లు.. చంకలో, భుజాలపై బిడ్డలు.. అవి చాలవన్నట్లు చేతిలో సంచులు.. ఇవన్నీ పట్టుకొని జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తేనే బయటపడొచ్చు. అలా అని వీరేం అడువుల్లోకి వెళ్లలేదండోయ్. ఈ ఆనకట్ట(floods 2021 news) దాటితేనే చాలామంది రోజువారి పనులు చేసుకోగలరు. అందుకే ఇంత కష్టపడి వెళ్తూ ప్రయాణాలు సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా సంగం ఆనకట్ట వద్ద ప్రజల వరద కష్టాలివి.
floods 2021 news: చంకలో బిడ్డలు.. భుజాలపై సంచులు.. వరద ప్రవాహంలో రాకపోకలు..! - nellore floods news
ఓవైపు నడుములోతు నీళ్లు(floods 2021 news).. మరోవైపు చంకలో బిడ్డలు.. భుజాలపై సంచులు. ఇలాంటి పరిస్థితుల్లో అడుగు తీసి అడుగు వేయాలంటే భయంగా ఉంటుంది కదా. కానీ అక్కడి ప్రజలు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ ఆనకట్ట దాటుతారు. ఎందుకంటే అది దాటితేనే రోజువారీ పనులు చేసుకోగలరు.
సంగం, చేజర్ల, పొదలకూరు మండలాలకు చెందిన 100 గ్రామాల ప్రజలు నిత్యం ఇలా రాకపోకలు సాగిస్తున్నారు. నెలరోజులుగా సోమశిల జలాశయం నుంచి నీటిని(floods 2021 news) వదులుతున్నారు.. డిసెంబరు వరకు వరద కొనసాగే అవకాశం ఉంది. ఆనకట్టకు దిగువన బ్యారేజీ వద్ద పైవంతెన అనుసంధానం పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్యారేజీ వద్ద ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:anthrax symptoms: వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం