ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంపుపై ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధ ప్రైవేటు కంపెనీల్లో కానరావడం లేదు. కేంద్రం అనుమతి తీసుకొని దేశంలోకెల్లా అత్యధికంగా 8.14 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్ణయించింది. 27 జిల్లాల్లో తొమ్మిది ప్రైవేటు కంపెనీలకు భూమి కేటాయించింది. ఈ కంపెనీలు ఆయా జిల్లాల్లో రైతులను చైతన్యపరిచి ఆయిల్‌పాం సాగువైపు మళ్లించాలి. నిజానికి ఈ మొక్కలు మనదేశంలో లేనందున దక్షిణ అమెరికా ఖండంలోని కోస్టారికాతోపాటు ఇండోనేసియా, మలేసియా నుంచి నారు తెప్పించి ఇవ్వాలి. కనీసం 3 నెలల ముందు అక్కడి కంపెనీలకు ఆర్డరిస్తేనే ఆయా దేశాలు మూణ్నెల్లు నర్సరీలో పెంచిన మొలకలను కార్గో విమానాల్లో ఇక్కడికి పంపుతాయి.
మొక్కలు వచ్చేదెన్నడు.. రైతుకిచ్చేదెప్పుడు? - OILPAM CULTIVATION IN TELANAGANA
ఆయిల్‌పాం సాగు పెంపుపై ప్రైవేటు కంపెనీలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. 27 జల్లాల్లో తొమ్మిది ప్రైవేటు కంపెనీలకు భూమి కేటాయించి రైతులను ఆయిపాం సాగువైపు మళ్లించేలా చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రైవేటు కంపెనీ యజమానులు భూమి అయితే ఆక్రమించారు కానీ... కనీసం ఆయిల్‌పాం మొక్కలను కూడా ఇప్పటికీ తెప్పించలేరు.
అక్కడి నుంచి ప్రతి జిల్లాకు తరలించి ప్రత్యేకంగా నిర్మించిన హరిత పందిరి లేదా షేడ్‌నెట్‌లో 3 నెలలు, ఆ తరవాత సాధారణ వాతావరణంలో మరో ఏడెనిమిది నెలలు పెంచాలి. తర్వాత వాటిని రైతుకు అందించాలి. లక్ష ఆయిల్‌పాం మొక్కలు పెంచాలంటే కనీసం 8 ఎకరాల్లో నర్సరీ ఏర్పాటుచేయాలి. ఎకరానికి 57 మొక్కలు నాటాలి. మొత్తం 8.14 లక్షల ఎకరాల్లో నాటేందుకు 4.63 కోట్ల మొక్కలు అవసరం. ప్రభుత్వ సంస్థ అయిన ‘రాష్ట్ర నూనెగింజల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య’(ఆయిల్‌ఫెడ్)కు ఈ సాగులో 30 ఏళ్ల అనుభవం ఉండటంతో ఇప్పటికే 10 లక్షల మొలకలను తెప్పించి సొంత నర్సరీల్లో పెంచుతోంది. ఇతర ప్రైవేటు కంపెనీలు ఇంకా నర్సరీలనే ఏర్పాటు చేయలేదు.
ఇదీ చూడండి:SCHOOL FEE: స్కూల్ ఫీజులు పెంచితే గుర్తింపు రద్దు