దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్-2021ను ఒక్కసారే నిర్వహించనున్నారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో పరీక్షను రెండుసార్లు జరపాలని విద్యార్థుల నుంచి కేంద్ర విద్యాశాఖకు భారీ సంఖ్యలో వినతులు అందాయి. ఫలితంగా రెండుసార్లు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కోరుతూ జాతీయ పరీక్షల మండలి (ఎన్‌టీఏ) జనవరిలో కేంద్ర వైద్యశాఖకు లేఖ రాసింది. దీనిపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పొఖ్రియాల్ సానుకూల సంకేతాలు ఇవ్వడంతో కచ్చితంగా రెండుసార్లు జరుపుతారని భావించారు. సిలబస్‌లో మార్పులు, జేఈఈ తరహాలో ఛాయిస్‌లూ ఉండొచ్చని కేంద్ర మంత్రి ఇటీవల వెల్లడించారు.
ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సుల ప్రవేశపరీక్ష ఒక్కసారే! - telangana news 2021
ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్-2021ను ఒక్కసారే నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల మండలి ప్రకటించింది. ఈ వారంలో పరీక్ష తేదీని వెల్లడిస్తామని తెలిపింది.
ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సుల ప్రవేశపరీక్ష ఒక్కసారే!
అయితే తాజాగా పరీక్షను ఒక్కసారే జరపాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఎన్‌టీఏ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ వారంలో పరీక్ష తేదీని వెల్లడిస్తామని చెప్పారు. రెండుసార్లు నిర్వహించేందుకు వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇవ్వకపోవడంతోనే ఇందుకు కారణమని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పరీక్షకు హాజరవుతారు.