వైద్య కళాశాలల్లో ప్రవేశానికి వీలు కలిపించే అర్హత పరీక్ష ‘నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్’కు (నీట్ యూజీ 2020) దరఖాస్తు చేసుకోవటానికి ఆఖరి తేదీని జనవరి 6 రాత్రి 11:50కు పొడిగించారు. మొదట ఈ గడువు డిసెంబర్ 31, 2019గా ఉండేది. వెబ్‌సైట్‌లో ఏర్పడిన రద్దీ కారణంగా అనేక మంది విద్యార్థులు ఆ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోలేకపోయారు. గడువును పొడిగించాలంటూ అనేక విజ్ఞాపనలు అందుకున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ తెలిపింది. విద్యార్థుల సౌకర్యార్ధం నీట్ దరఖాస్తు గడువును పొడిగించినట్టు ఆ శాఖ అధికారులు వివరించారు. కాగా ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలు చేసుకునేందుకు గడువు యధాతధంగా అంటే జనవరి 15 నుంచి 31 వరకు ఉంటుందని వారు వివరించారు. ఇక కశ్మీరు లోయ, లెహ్, కార్గిల్ ప్రాంతాల అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్లో నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్టీఏ) నిర్దేశించిన నోడల్ కేంద్రాల వద్ద అందచేయవచ్చు.
నీట్ దరఖాస్తు గడువు పొడిగింపు - exam
ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర మెడికల్ కోర్సులకు సంబంధించి దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశం కల్పించే నీట్‌పరీక్షకు దరఖాస్తు గడువు పెరిగింది. వెబ్సైట్ రద్దీ కారణంగా జనవరి 6వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని యంత్రాంగం సూచించింది.
నీట్ దరఖాస్తు గడువు పొడిగింపు
Last Updated : Jan 1, 2020, 10:47 PM IST